STORYMIRROR

Venkata Rama Seshu Nandagiri

Inspirational

4  

Venkata Rama Seshu Nandagiri

Inspirational

యువతరం

యువతరం

1 min
351

శీర్షిక : యువతరం

మన దేశం, భారత దేశం, అన్నపూర్ణ వంటిదీ దేశం,

సాహిత్య, సంగీత, కళలకు కాణాచియైనదీ దేశం,

ఎందరెందరో మహానుభావులు జన్మించినదీ దేశం,

వీర పురుషులు, ధీర వనితలు పరిపాలించినదీ దేశం.

నేడు రగులుతున్నది, కుల, జాతి, మత, విభేదాలతో,

క్షోభింపచేస్తున్నది, స్త్రీ జాతిని జాత్యహంకారముతో,

అల్లాడుచున్నది దేశం ధనిక, పేద తారతమ్యాలతో,

అట్టుడుకుతున్నది భరతఖండం మారణహోమాలతో

భరించలేకున్నాము ఈ దారుణ మారణ హోమం,

మాకు కావాలి మన ప్రాచీన భారత దివ్య వైభవం,

స్త్రీలను పూజించే ఋత్విక్కులు గల పుణ్యక్షేత్రం

కావాలి ప్రాకృతిక సంపదతో అలరారు పచ్చదనం.

నడుంకట్టాలి అటువంటి దేశానికై నేటి యువత,

చాటాలి ఎలుగెత్తి మన భవ్య దేశ దివ్య చరిత,

అభివృద్ధికై పని చేసేవారి చేత పెట్టాలి ప్రభుత,

తేవాలి జాతి, కుల‌, మత, వర్గ వివక్ష లేని సమత.

కదలి వస్తోంది యువతరం సమాజ శ్రేయస్సుకై,

కృషి చేస్తుంది సకల జనుల సౌభాగ్య సంపదకై,

పాటుపడుతుంది తారతమ్యాలు లేని సమాజానికై,

పునాది వేస్తుంది నవ సమాజ బృహన్నిర్మాణానికై.

ఎదురు చూద్దాం మన దేశ భవ్య నిర్మాణత కోసం,

వేచి చూద్దాం యువత చేసే కృషి ఫలితం కోసం,

సహకరిద్దాం వారికి, చేసి మన చేతనైన సహాయం,

మనము కలలు కనే మరో ప్రపంచాన్ని స్వాగతిద్దాం.


Rate this content
Log in

Similar telugu poem from Inspirational