యువత నీ లక్ష్యం ఎటువైపు ? - kaweeshwar
యువత నీ లక్ష్యం ఎటువైపు ? - kaweeshwar
అంశం.. నీ పయనం ఎటు
పేరు.. జయంత్ కుమార్ కవీశ్వర్
శీర్షిక.. యువత నీ లక్ష్యం ఎటువైపు ?
**** 22.07.2022
జనని జనకుల కష్టాలను లెక్కచేయని నీ మస్తిష్కంలోకి
అల్లరి చిల్లరగా తిరిగేడు నీ సహవాసులు చేసిన పనికిమాలిన
శ్రుతబోధ మానవత్వం వదిలిన పనులకు ప్రేరేపణలు
తోడేళ్ళ వలే వావివరసలు లేక అమాయకుల పనులలో
ఆటంకాలను కావాలనే కలిగించే చెడుదారిన యువత
ఏమి సాధించెదరని సమయము , డబ్బు మొదలైనవాటిని
వృధాపరచుకొని ఏమాత్రము లక్ష్యము లేకుండా తిరుగాడు యువత
నిన్ను నీవు కాపాడుకోలేని దుస్థితికి చేరుకునే వైపునే సాగుతున్నది మీ పయనం
సంస్కారము లేక పడ తులను అగౌరవ పరిచేడి నీ నైజం
నీకు రక్షణ లేక , ఇతరులకు రక్షణ లేక ఇతరులచే అవమానాలను పొందెదవు
వాహనములనిష్ఠము వచ్చినట్టు నడిపి నీ , ఇతరుల ప్రాణములతో చెలగాటమాడెదవు
యువతా నీ దెస మార్చుకో , పెద్దలు చెప్పిన విధం గా మసలుకో లోకోపకారంతో
మానవత్వాన్ని , కారుణ్యాన్ని చూపి దేశ భవిష్యత్తులో కీలక పాత్రను పోషించు
మత్తులవాట్లకు బానిసగా మారకు , ఒళ్ళు , ఇల్లు గుల్లచేసుకోకు చిత్రముగా నీ
ప్రవర్తనను మార్చుకొని తరువాత తరానికి ఆదర్శమూర్తి వై వెలుగొంది తరించు
అక్షర సేద్యాన్ని నిరంతరమూ చేసే సమాజ కర్షకునిగా మారి నూతన ఉపయోగిక
భావాలను అనుభవ వర్యులకు, భావి తరాలకు కల్మషాలు లేని యూద్ధాలు లేని
శాంతిని అందించి , సమాజము నకు తలలో నాల్కెవై కరతలామలకం గల
జ్ఞానాన్ని అందించు బేధభావాలను ప్రజల మధ్యలోనుండి తొలగించి -
వారిని కూడా కలతలు లేని మార్గాన్ని అనుసరింపజేయి.
******* kaweeshwar
