యువ కెరటం
యువ కెరటం
ఓ భావి భారత యువత మేలుకో
నీ భవిష్యత్తు రూపు మార్చుకో
స్వయం జాగృతివై
చీకటిని చిదిమేసే
చిరుదివ్వెవై వెలిగిపో!
సందేశం కాదిది సంకోచించక
నీ ఆత్మ అంతరిక్షంలో
పరిశీలించి చూడు
నీ శక్తి యుక్తులలో
ఆత్మస్థైర్యమనే రక్తాన్ని నింపుకో!
అజ్ఞానపు ఛాయలను ఛేదించి
తిమిర సంహారకుడై
సౌభాగ్యపు సౌభ్రాతృత్వాన్ని
శాశ్వత చరితగా లిఖించు!
ఓ భావిభారత యువత మేలుకో
నీ భవిష్యత్తు రూపు మార్చుకో
స్వయం జాగృతివై
చీకటిని చిదిమేసే
చిరుదివ్వెవై వెలిగిపో!