STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

యజమాని కోసం

యజమాని కోసం

1 min
219

ఋతువులు మారుతున్నాయి

చెట్లు మోడుగా మారుతూ

మళ్లీ వికసిస్తున్నాయి


ఆవలి తీరం వైపుకు చూస్తూ

యజమాని కోసం నిలబడింది

ఎవరైనా బాటసారులు కనిపిస్తే

వారి చుట్టూ తిరిగేది

దయుంచి నాలుగు మెతుకులు విదిలిస్తే

అవి తిని మళ్లీ అక్కడే ఉండేది


యజమాని రాకపోతే

అనే ధ్యాస లేదు

ఏ రోజైనా వస్తాడని

వార్థక్యం వచ్చే వరకూ 


చివరి శ్వాస విడిచేటప్పుడు

కొలనులోకి తొంగి చూసి

యజమానిని గుర్తు చేసుకుంది


ఎవరో తల మీద చెయ్యి వేసినట్లు 

ప్రేమగా పిలిచినట్లు

అనుభూతి కలిగింది

అది యజమాని స్పర్శలా అనిపించింది

కళ్ళు మూసుకుని 

చిన్నగా నవ్వి మళ్లీ కళ్ళు తెరవలేదు



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract