STORYMIRROR

T. s.

Tragedy

4  

T. s.

Tragedy

వ్యథ

వ్యథ

1 min
359

నీ మోము వికసించాలి అంటే..

నా కన్నుల వెంట కన్నీరు జాలువారాలని తెలిసి

సిద్దపడ్డా కలవరపడడానికి, కనురెప్పల చాటున వ్యథ దాయడానికి..

నీకు కావాల్సింది ఇదే కదా..

నన్నుందుకోవాలనే నీ తపన..

నా గుండెల్లో శరములై గుచ్చుకుని నా మదిని

కన్నీటి సంద్రంలో ముంచిపోతుందే నీ తపన

ఏమి చేయాలని నన్ను నాలో లేకుండా చేసి

ఏమి చేయాలని నన్ను నాలో లేకుండా చేసి

కనురెప్పల చాటున దాగిన నా వ్యథలు

నీకు అర్థం కావని తెలిసి ఆవేదన వర్షిస్తూ కళ్ళ వెంట

కలవరించేనే నా మనసు కల్లోలమై..

ఎందుకు ఈ వ్యథ నా వ్యథలే నాకు సముద్రమంతా

నా వ్యథలే నాకు సముద్రమంతా..

చాలు.. చాలు ఇక ఈ ఉప్పెనల ఉత్సవం..

ఆపరాదా ఈ విషాద సమరం

ఎందుకు నాపై ఇంత కినుక..

ఎందుకు నాపై ఇంత కనికరం లేకుండా

ఎదను ఏడిపించి ఏం బావుకుందామని

ఏం మిగులుతుంది ఈ బంధనాల బంధంలో

ఏం మిగులుతుంది ఈ బంధనాల బంధంలో..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy