వన్నెల వయ్యారి
వన్నెల వయ్యారి
కలువ కన్నుల చిన్నది
వలపు వీణ మీటినది
సరిగమల సరాగాలు పలికించి
అలల అలకలతో ఊరించి
ఊపిరితీగల హోరుతో జోరును పెంచి
విరహ జ్వాలలతో దహించి
పున్నమి వెన్నెల సైతం వేడెక్కించే
వన్నెల వయ్యారి
అరవిచ్చిన అందాలతో
మిలమిల మెరిసే మిణుగురుల కళ్ళతో
సోయగాలు ఆరబోయగా
ఏమని వర్ణించదెను ఆమె శృంగార నైషధాన్ని
ఎంతని వివరించెదను ఆమె సుందరకాండ వైవిధ్యాన్ని