STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

4  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

విధి

విధి

1 min
233

ఎవడో ఏడ్చాడని, ఇంకెవడో ఎదిగాడనీ..!

ఎవడో తిన్నాడని, ఇంకెవడో తన్నాడని..!

ఎవడో దాచాడని, ఇంకెవడో దోచాడని..!!


ఆశలు హద్దులు మీరినా... కోర్కెలు కోటలు దాటినా...

ఆశయాలు మరుగున పడినా.. కలలు కనుమరుగయ్యినా..

ప్రమాదమే సుమా??


జీవితమే నీదైనపుడు, ఇతరులతో పోల్చుకుంటే ఇక దాని విలువేంటోయి?


"పొద్దస్తమాను కష్టపడే సూరీడు, అస్తమించెలే రాతిరికి.

ఆ రాతిరి కలవరపడేనా చీకటి పడేనని, చందమామతో వెలుగును పంచలే ప్రపంచానికి.


ఉవ్వెత్తున ఎగిసిపడే అల, శాంతించెలే చేరెలోపు తీరానికి.

ఆ తీరం కంగారుపడేనా కెరటం తాకునని, అడ్డుతో తిప్పికొట్టి పంపించలే వెనకకి."


లోకాన్నెలే వాటికే ఒడిదుడుకులు తప్పనప్పుడు..,

వాటి ఒడిలో బ్రతికే నువ్వెంత ! ఒక చిన్న అణువంత..!!


కాలంతో ప్రయాణించే ఓ చిరకాల నేస్తమా, 

నిరంతరం కష్టపడని వాడు కాదు, చిన్న కష్టాన్ని కూడా ఇష్టంగా ఆస్వాదించని వాడే సోమరిపోతు సుమా!! 


ఈ లోకం దృష్టిలో... 

సంపాదించే ప్రతోడు గొప్పోడు కాగలడేమో, 

మరణించిన ప్రతోడు మంచోడు కాగలడేమో 

కానీ, తన జీవితాన్ని తాను అనుభవించలేని వాడు మనిషి మాత్రం కాలేడనె వాస్తవాన్ని గ్రహించవోయి.. 


                            -సత్య పవన్✍️


Rate this content
Log in

Similar telugu poem from Abstract