STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

వేసవిలో పండు వెన్నెల

వేసవిలో పండు వెన్నెల

1 min
358

మరుగుతున్న ఆలోచనల లావాలు

మరిచిపోలేని సూరీడి పగటి బాధలు

ఎందుకని అడుగుతారు కన్నీటికి కారణాలు


విసిగిపోయాను

వేల ప్రశ్నల నుంచి విడుదలయ్యే సమయం ఇది

వేసవి చెమటల మీద చల్లగాలి

పండు వెన్నెల్లో ప్రకృతి నన్ను గాఢంగా హత్తుకుంది


కాసేపు చంద్రునితో దోబూచులాడి

చెలిమితో కలువలను చేరదీసి

వెన్నెల కాంతుల్లో విరహమను పుప్పొడిని చూసి

స్వపరాగ సంపర్కముతో తనువు ఫలించి

ప్రతి రాత్రీ ఒక ఎదురుచూపుకు తుది ఘట్టంగా మారుతుంది


ఎవరి మీద ఎవరికి ప్రేమ

నాకు ప్రకృతి మీదనా

లేక ప్రకృతే నన్ను వరించిందా


చంద్రుడిని విభూది రాయిలా ఒక పెట్టెలో పెట్టి

రోజూ కాస్త చలువ జ్ఞాపకాల్లా ఒంటికి అలదుకోనా

వెన్నెలను కెలిడియోస్కోప్ గోడల్లో బంధించి

కంటికి ఇంపైన దృశ్యాలను చూడనా


ఈవేల్టికి ఇద్దరం అలిసిపోయాం

పెనవేసుకుని నిద్రించే అలవాటు లేని జంటలా

కాస్త దూరం మంచిదే అని 

మళ్లీ రాత్రి వరకూ సూరీడి వెలుగులో ఉన్నాం


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract