Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

SATYA PAVAN GANDHAM

Action Classics Inspirational

4  

SATYA PAVAN GANDHAM

Action Classics Inspirational

"వేసవి విడిది..!"

"వేసవి విడిది..!"

1 min
274


ఒంటి పూట బడులు,

మండుటెండలో ఆటలు,

ఎండకు పేలిన వీపులు,

డర్మి కూల్ పౌడర్ పూతలు,

గుర్తుకొస్తున్నాయి ఓ జ్ఞాపకమై...!

ఉక్కపోత కష్టాలు,

కుండ నీళ్లకు ప్రాకులాటలు,

వరి కుప్పల అందాలు,

పచ్చిక బైళ్ళల్లో పశువుల సైన్యాలు,

గుర్తుకొస్తున్నాయి ఓ జ్ఞాపకమై...!

ఉషోదయ కిరణాలతోనే మెళుకువలు,

మధ్యాహ్నపు కరెంట్ కష్టాలతో అగచాట్లు,

చల్లని సమీరాల సేదతీర్పులు,

రాతిరికి మేడ మీద పరిచిన పడకలు,

గుర్తుకొస్తున్నాయి ఓ జ్ఞాపకమై...!

పిల్ల బావిలో కుప్పి గంతులు,

పుల్ల ఐసు నోటి రుచులు,

రేగిపళ్ళ కోసం పోట్లాటలు,

ఉసిరిపళ్ళకై కొట్లాటలు,

గుర్తుకొస్తున్నాయి ఓ జ్ఞాపకమై...!

ముంజు బళ్ళతో ఆటలు,

మామిడి పళ్ళ కోసం బారులు,

రూపాయి రస్నాకై తీసిన పరుగులు,

ఆశా చాక్లెట్స్కి ఖర్చుపెట్టిన రూపాయలు,

గుర్తుకొస్తున్నాయి ఓ జ్ఞాపకమై...!

గూటి బిళ్లలో పెట్టిన కాతలు,

ఏడు పెంకులాటలో మ్రోగిన వీపులు,

క్రికెట్ ఆటలో బెనికిన కాలు,

టైర్ ఆటతో నలిగిన చేతులు,

గుర్తుకొస్తున్నాయి ఓ జ్ఞాపకమై...!

విడిదికి ఆశ్రయమిచ్చిన అమ్మమ్మగారిల్లు,

బంధువుల సమూహాలను కలిపిన ఓ హరివిల్లు,

చుట్టాలు ఇచ్చిన డబ్బులు,

ఆ డబ్బులతో నిండిన డిబ్బీలు,

తిరుగు ప్రయాణంలో...

అమ్మమ్మ చెంత చేరి ఏడ్చిన తరుణాలు,

గుర్తుకొస్తున్నాయి ఓ జ్ఞాపకమై...!

mr.satya's_writings ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu poem from Action