STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Inspirational

4  

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Inspirational

వచన కవితా సౌరభం:మనసులో మాట:కవీశ్వర్ : 01.05 .2022 శీర్షిక : ఆలోచనల sarali

వచన కవితా సౌరభం:మనసులో మాట:కవీశ్వర్ : 01.05 .2022 శీర్షిక : ఆలోచనల sarali

1 min
244

వచన కవితా సౌరభం : మనసులో మాట 

కవీశ్వర్ : 01 . 05 . 2022 

శీర్షిక : ఆలోచనల సరళి : 

ఉషోదయాన ఉదయ భానుని వెచ్చని వెల్గులతోనా 

మానవ మేధస్సు జనియించి నచ్చిన ఆలోచనల మేనా 

నిష్కల్మషమైన శిశువు ఆనంద హర్షాతిరేకముల వీణా

బాలల క్రీడా మైదానముల ఆటల కేరింతల నజరానా 

 

చిరు జల్లుల దృశ్య కవనము ల అంశముల ప్రకృతి లలనా 

సారస్వతముతో సెలయేరు సరస రవముల సోయగా గమనా

చిత్రకారుని కుంచెనుండి జాలువారే సుందర కమనీయ దృశ్యమా 

గాయక శిరోమణి గాత్రం నుండి రాగయుక్త రమణీయ స్వర గానమా 

 

విద్యార్థుల జ్ఞాన సముపార్జన లక్ష్య సాధన జీవన సాఫల్యత కై సమరమా

దేశభవిత కై యువత సరియైన మార్గ దర్శన అవలంబన సోపాన మార్గమా

ప్రభుత సహాయ సహకారముల కొరకై ఎదురుచూసే స్వయం ఉపాధి జనమా 

సాంస్కృతిక , పర్యాటక అభివృద్ధికై సకల జనుల ఎల్లవేళల సహకారమా 


సాంకేతికత ననుసరించి సులభ సాధ్యమైన కార్యక్రమముల అనుక్రమణమా 

స్వార్థం తో , కుటిల రాజకీయాల ప్రేరేపితమైన న్యాయ విధుల అతిక్రమణమా 

కులతత్వం,అశాంతి మయమైన దేశమెన్నడు బాగుపడునోయని ప్రజల ఆశ యమా 

చిరకాల అభివృద్ధిని కాంక్షించే జనుల సేవలచే సంతసించే దేశమాత సంబరమా 


Rate this content
Log in

Similar telugu poem from Abstract