Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

వాసన లేని పువ్వుల మాల

వాసన లేని పువ్వుల మాల

1 min
353


ఆమెకిష్టం అవి

పసుపు పచ్చగా ఉంటాయి

శుక్రవారం ఆమె ముఖంలా మెరుస్తాయి

వాడిపోయినట్లే ఉండవు


వాసన లేని పువ్వులు

అవంటే ఆమెకు మక్కువ

దేవుని పూజకు అవే మాలలు కట్టేది

వాటిని జడలో కూడా తురుముకునేది


ఎందుకు ఆ పూలంటే అంతిష్టం

ఆమె దగ్గర జవాబు లేదు

ఆలోచించింది

వాసన ఇచ్చి దేన్నో అవి గుర్తు చేయవు

వాసన లేవని అవి అందంగా లేకుండా ఉండవు


ఏ కోరికలూ లేని ఆమెలాగా

అవి కూడా రోజూ ఒకేలా ఉంటాయి

వాసన లేని పువ్వులు

ఆమెలా అందంగా ఏ బాదరబందీ లేకుండా

ఆమెతో ఉండిపోతాయి


Rate this content
Log in