వారసత్వం
వారసత్వం
ప్రభాత సూర్యుని నులివెచ్చని కిరణాలు
చల్లగవీచే మంద్ర సమీరపు వింజామరలు
పక్షుల కిలకలలు, కోయిల కమ్మని రాగాలు
అందరినీ జాగృత పరిచే మేల్కొలుపులు
మనోహరమైన సుందరమైన కమనీయ దృశ్యం
పల్లెపట్టున అక్కడక్కడా కనిపించే ఆదృశ్యం
మన పట్టణవాసులకు ఏనాడో అయినది మృగ్యం
భావితరాలకు ఈ అందాలను కానివ్వరాదు మృగ్యం
వారికి బహుమతిగా పచ్చని ప్రకృతిని ఇవ్వాలి
ఆ కమనీయ దృశ్యాలు మన పిల్లల సొంతం కావాలి
దానికై ఈతరం శ్రమించి వృక్షారోపణ చేయాలి
ఆరోగ్యకర వాతావరణం వారికై మనం నెలకొల్పాలి
అదే మనం అందించవలసిన వారసత్వం వారికి
ధనం కాదు, పచ్చదనం ఇవ్వాలి బహుమతిగా వారికి
ఏనాడూ ప్రాకృతిక సంపద కరువు కారాదు వారికి
అభివృద్ధి, అభ్యున్నతి ప్రాకృతికంగా జరగాలి వారికి
ప్రకృతి ఉంటే పచ్చగా, ఉంటుంది నిండుగా మనజీవితం
అనుసరిస్తూ ప్రకృతి ధర్మాన్ని జీవితాన్ని కాపాడుకుందాం
పట్టణాలను, పల్లెలను కలుపుతూ, బాటలు నిర్మిద్దాం
మనందరినీ సంరక్షించమని చేద్దాం ప్రకృతిమాతకు ప్రణామం