ఊసులోన
ఊసులోన
తలుపు చాటు నేనున్నా..తలపువాన వాగులోన..!
వలపుహోరు వింటున్నా..గుండెపాట గూడులోన..!
తేనెకురుల ఘోషతీర్చు..తియ్యనైన పవనమేదొ..
వీచేనను ఆశతోటి..వేడుకైన చూపులోన..!
నువు వ్రాయని లేఖలోని..సంగతులవి అందునెలా..
సడిసేయక ప్రవహించే..అందమైన యేఱులోన..!
చెక్కిలింట పరిమళించు..అరుణిమలే తోడైనవి..
సిందూరపు కాంతిపూల..వర్షమైన నవ్వులోన..!
రాలుతున్న పూలకెరుక..అసలుప్రేమ అలికిడేదొ..
పలుకోర్కెల సాక్షిగాను..వెలుగుతున్న నిప్పులోన..!
షహనాయి పలుకలేని..రాగాలకు స్వరములేవొ..
తెఱచాపను కదిలించే..తియ్యనైన ఊసులోన..!
