ఊహల్లో
ఊహల్లో


ఊహల్లో కూడా ఎరుగని ఉహాన్ లో పుట్టావు
ఊరూరా తిరుగుతూ మా కాడకు వచ్చావు
ఊరెమ్ బడి తిరగనీక ఇంటిలోకి నెట్టావు
ఊరుకోక ఉరకలేక ఇంటికాడ నిలవనీక
ఊరుమీద పడ్డ మాలో
కొందరితో జత కలిపి
ఊరులోన ఉన్న ఆసుపత్రులేమో నిండినాయి
ఉసురుపోస్తున్న మా దేవుళ్ళకు విశ్రాంతిని కలిగించి
ఊరు విడిచి వెళ్ళమని చెబుతున్నాం ఓ కరోనా...