STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

ఊహల పరిమళం

ఊహల పరిమళం

1 min
359

ఎక్కడో అత్తరు వాసన గుప్పుమంది

మరెక్కడో విరహావేశం చల్లారింది

ఆశల నిప్పులు కాల్చిన మూకుడులో

మన అవినాభావ సంబంధం మాడిపోయింది


నిశి రాతిరి అందరూ చందమామ గురించే మాట్లాడతారు

నువ్వు మాత్రమే చీకటి అందం గురించి మాట్లాడావు

ఎంత భావుకత

ఎంత సమదృష్టి 

అని నేను నీకు దాసోహమయ్యాను


ఆనక నీ గురించి తెలిసీ

కదిలే రెప్పల చాటున నొప్పిని భరియించి

నీ కోసం వగచాను

ఎంతని చెప్పను అంటూ తరగని ప్రేమని కురిపించాను

నేడు కన్నీరు ఇగిరిన నిజమయ్యాను


ఇంకెందుకు కల్లబొల్లి కబుర్లు

కనిపించే జీవితాన్ని ఉన్నది ఉన్నట్టు

ఇరుకైన గదుల్లాంటి ఆలోచనల్లో

నన్ను నేను ఇముడ్చుకుంటాను

మసివారిన చిమ్నీలోంచి

కొత్త ఊహల పరిమళంలా బయటికి వస్తాను.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract