ఊగిసలాట
ఊగిసలాట
సగటు మనిషికి
అనుక్షణం ఊగిసలాటే బతుకు
ఆశనిరాశల మధ్య
కష్టనష్టాల మధ్య
చీకటి వెలుగుల మధ్య
నిజాబద్ధాల మధ్య
ఊహలు ఊసుల మధ్య
అవకాశాలు అవసరాల మధ్య
కలలు కల్లోలాల మధ్య
ఇష్టాయిష్టాల మధ్య
గమనం గమ్యం ల మధ్య
జయాపజయాల మధ్య
నీతినిజాయితీల మధ్య
ధర్మాధర్మాల మధ్య
ఇలా ఎన్నో..ఎన్నెన్నో..
నిత్యం నలుగుతూ ఊగిసలాట
అన్నీ కలిస్తేనే కదా జీవితం
అందులో నువ్వుంటేనే కదా జీవితం
