ఉసిరికాయ తిందామా
ఉసిరికాయ తిందామా


ఎంత చిత్రమైన పనులో అవి
ఇప్పుడు తలచుకుంటే నవ్వులు పూయిస్తాయి
ఉసిరికాయ నేరుగా కొరకకుండా పలువరుసల మధ్య ఉంచి
పంటి గాటు దాని మీద పడి దాని రుచిని ఆస్వాదిస్తూ
మధ్యలో కాస్త ఉప్పు కారం దానికి తగిలిస్తూ
నోరంతా దానిని తిప్పుతూ
చివరికి గింజ మాత్రం మిగిలెంత వరకూ తిప్పి
అదో విజయంలా స్నేహితులకు చూపించడం
తరువాత నీళ్ళు త్రాగి ఆ రుచిని మరింత ఆస్వాదించడం
ఉసిరికాయ తినడం బాల్యపు మధుర జ్ఞాపకం