STORYMIRROR

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Fantasy Inspirational

4  

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Fantasy Inspirational

తత్వబోధ

తత్వబోధ

1 min
261

వెచ్చని వెలుగుల

తూరుపు రేఖలూ

చల్లని మెల్లని

సుతారమైన

ఉదయపు గాలీ

అనిర్వచనీయమైన

సంతోషంతో

తలాడిస్తూన్న చెట్లూ

కమ్మని సంగీతాన్ని

వినిపిస్తున్న పక్షులూ...

ఆకసాన 

హద్దులు లేకుండా

పరుగులు తీస్తూన్న

మేఘపు తునకలూ...

నాకు వినిపించే

తత్వ బోధనలు

ఏ తత్వవేత్త

ఉపన్యాసాలలోనూ

మచ్చుకైనా

దొరకలేదు


Rate this content
Log in

Similar telugu poem from Abstract