Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

ARJUNAIAH NARRA

Romance Fantasy Others

4.9  

ARJUNAIAH NARRA

Romance Fantasy Others

తియ్యని ఎదురుచూపులు

తియ్యని ఎదురుచూపులు

1 min
688



నిశీధిలో నీ కోసం ఎదురు చూస్తున్న

పున్నమి వెన్నెలవై ఎదురు వస్తావని

నిశ్శబ్ద ఘడియల్లో నిల్చొని వింటున్న

నా గుండెసడి నీ గుండెను చేరుకోవాలని


తీయ్యని మాటలను మాలలుగా అల్లుకున్న

నీ చెవిలో వేసి నన్ను ఏలుకొమ్మని

సంధ్యకాలమున విరిసిన మల్లెలను

చెలికత్థేలుగా వెంటేసుకొని

సాగర తీరపు అంచున నిల్చున్న 

కడలి అలల నన్ను అల్లుకుంటావని


నా ఊహలకు ఉపిరి పోశావు

నా మనసుకు రెక్కలు ఇచ్చావు

నేను ఇప్పుడు ఎడారి ఎండమావి కాను

నా మది మావి చిగురు తిన్న 

వసంత కోకిలలా పాడుతుంది

నాలో కోరికలు సముద్రపు నురగల్లే

అలల మీద అలలారుతున్నవి....


నా కళ్ళు లక్షల భావాల భారంతో

నీ కళ్ళ రాకకై వీక్షిస్తున్నాయి

నీ ప్రేమ పరిమళాలతో

నా మేని గుబాలించింది 

ఏకమైయ్యే శ్వాసల సాక్షిగా 

అమర ప్రేమికులుగా 

అనంత కాలంలోకి ప్రవహిద్దాం....


ఏకాంత వీధుల్లో, నిర్జన దారుల్లో

నిశ్శబ్ద రాత్రుల్లో, నీశిధి ప్రవాహంలో

వెన్నెల దారుల్లో, వేసంగి వేకువ జాములో

నీ రాకకై నీరిక్షణ....రా ప్రియతమ!

**************************


సమీరం దూరం నుండి సిని సంగీతాన్ని 

లీలగా మోసుకొచ్చింది


("ఈ వేళ లో నీవు ఏం చేస్తూ ఉంటావో

అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను

నా గుండె ఏనాడో చేజారిపోయింది

నీ నీడగా మారి నా వైపు రానంది

దూరాన ఉంటూనే ఏం మాయ చేశావో

ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో

అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను")










Rate this content
Log in