తిరుమల గీతావళి
తిరుమల గీతావళి


ప: మారని మనుషులము మేము
గోవిందా
తీరు మారని మనుషులము
మేము
కరుణ తీరము చేర్చుము మము
గోవిందా
చ: మొక్కులు నీకు మొక్కెదము
తప్పులుమాత్రం ఆపము
మేము
చేయము ఏ సాయము
మనుషులకు
నిను కొలిచిన చాలను
మూర్ఖులము
చ: ఆకలిదప్పుల మనుషులకు
ఆసరానీయము
మా కోరికలు తీరిన చాలును
మాకు
వంచనతో నీ అండకోరుదము
మారని మాతీరును
మార్చవయా
చ: కలియుగదైవమని నిను
కొలిచెదము
స్వార్థపుబుద్ధిని మే
మరిచెదము
జీవకోటికి ప్రాణము నీవుగ
మా మందబుద్ధికి ప్రాణము
పోయుమా