STORYMIRROR

Gayatri Tokachichu

Inspirational

3  

Gayatri Tokachichu

Inspirational

తెలుగు భాష

తెలుగు భాష

1 min
3

తెలుగు భాషావికాసము


మాతృభాషను మరచి శుంఠలౌ మనుజులకిపుడు 

మనభాష యొక గొప్పతనమును తెల్పుటెపుడు?

తెలుగు భాషను విస్మరించిన నవతరము

తెలివి లేని మూఢ కులానికి వారసులము

పూర్వపు ఠీవి, దర్పాలిప్పుడు కానరావు

భాషోన్నతికి ప్రణాలికలన్నవి లేనే లేవు

చెదిరి పోయిన వానాటి భువనవిజయాలు

కుదేలైనవా సుందర,పటిష్ట భాషా సౌధములు

కొడిగట్టెడి దీపము వోలె దీనయై మనభాష

మినుకు మినుకు మంటున్నదీ మాతృభాష

పరులకు దాసియై దుఃఖించి విలవిల

తెరలుచున్న దీనాడు పేదరాలై వెలవెల

కాపుగాయగ రండిటు తెలుగు సోదరులారా!

కరముకరము కలపండి భావిపౌరుల్లారా!

జవసత్త్వాలు తెలుగు తల్లి కందించండి!

నవ కవితా వికాసాన్ని నలుగురికీ పంచండి!


Rate this content
Log in

Similar telugu poem from Inspirational