STORYMIRROR

VENKATALAKSHMI N

Tragedy Inspirational Others

4  

VENKATALAKSHMI N

Tragedy Inspirational Others

తెల్లకోటుకు వందనం

తెల్లకోటుకు వందనం

1 min
254


పరోపకారమే పరమ ఔషధంగా 

కరుణనే కవచంగా ధరించి

కనిపించని శత్రువుతో

నిత్యం సమరం సాగిస్తాడు అతడు..

తమ అసువులనే అర్జీలుగా రాసి

ఉసురు పోయడమే దీక్షగా పూనిన

సర్వేజనా సుఖినోభవంతుకు నిలువెత్తు సాక్ష్యం అతడు..

ముగిసిపోయిందనుకున్న నుదిటి రాతను

మలుపు తిప్పగల అపర భగీరథుడు అతడు..

కత్తులు కరవాలాలతో కాదు

ధైర్యం ధృఢ సంకల్పాలే సైన్యాలుగా మార్చి

ప్రతియుధ్ధంకై తలపడ్డ ధన్వంతరీ అతడు..

మానవసేవనే మంత్రంగా జపిస్తూ

మృత్యువుకే ఎదురేగి విజేతగా

పడమరంచు కొన శిఖరమై నిలిచే 

తూరుపు అతడు..

అంతు చిక్కని సవాళ్ళకు ధీటుగా

నిలుస్తూ సరికొత్త పేజీని చరిత్ర ఖాతాలో చేరుస్తాడు అతడు.. 

స్వచ్ఛమైన మనసుకు నిదర్శనంగా 

అతడు ధరించిన తెల్లకోటుకు

వెనుక దాగి ఉన్న స్ఫటికం లాంటి మనసుకు వందనం పాదాభివందనం...



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy