స్వేచ్ఛగా
స్వేచ్ఛగా
అలనాటి స్వాతంత్ర్య పోరాటం
పాఠ్యాంశాల్లో చేర్చబడింది
నేటి భారత సైన్యం చేసే పోరాటం
కూడా పుస్తకాల్లో చేర్చాల్సిన సమయమిది
పోరాడి తెచ్చుకున్న స్వేచ్ఛ
రాజకీయ ఉపన్యాసాలకు పరిమితం కారాదు
అన్యాయాన్ని ప్రశ్నిస్తూ
రాజ్యాంగబద్ధమైన పాలనను అందరికీ చేరుస్తూ
వివక్షలను రూపుమాపి
కొత్త తరాన్ని తయారు చేయాలి కదా
ఇంకెన్నాళ్ళు మౌనంగా భయపడాలి
అధికారం ఆపన్నులకు అండగా లేనప్పుడు
ఆటవిక సమాజపు లక్షణాలకు
అధిక బలం సమకూరుతున్నప్పుడు
హింసే మార్గమని జాతి నమ్ముతున్నప్పుడు
స్వాతంత్ర్య ఫలం దక్కుతుందా
ప్రజల క్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వాలు
వారిని ప్రపంచ మార్పులకు తగ్గట్టు చూసుకోవాలి
భవిష్యత్తు గురించి ప్రణాళిక లేకుండా
కేవలం నేటి అధికార నిలుపుదల కోసం
ప్రయత్నాల్లో మునగక
ఒక సుస్థిరమైన
బలమైన
ప్రజాస్వామ్య వ్యవస్థను మనం నిర్మించుకోగలగాలి
అప్పుడైనా
ఆనందంగా ప్రజలు జీవించే దేశాల్లో
ఈ దేశం అగ్రస్థానం చేరుతుందేమో
