STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

స్వేచ్ఛ

స్వేచ్ఛ

1 min
368

అడుగు వేసేందుకు వెయ్యి రకాల ఆలోచనలు

ఆపైన వంద రకాల అనుమానాలు

ఆహారం

వస్త్రాలు

వస్తువులు

అన్నిటిలో స్వేచ్ఛ కావాలి మనకు

స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంతున్నట్లు భ్రమలో బతికినా చాలు

అదో ఆనందం


నిజమైన స్వేచ్ఛ వీటితో ఆగిపోదు

చీకటి వెలుగుల ఆలోచనల్లో

వాటిని వ్యక్తపరిచే విధానాల్లో

విరుద్ధ భావాలు గల ప్రజలు కలిసి జీవించే వాతావరణంలో

ఇలా ఎన్నిటిలోనో స్వేచ్ఛ కావాలి


ఇది నాకు నచ్చలేదు అని చెప్పగలిగే స్వేచ్ఛ కలిగిన వ్యక్తులకు

ఇతరుల భావాలను కించపరిచే హక్కు లేదని తెలియజెప్పేంత స్వేచ్ఛ

ఇంగిత జ్ఞానం కలిగిన స్వేచ్ఛ

కావాలి

స్వేచ్ఛ పేరుతో జరిగే వికృతాలు చూసి 

రేపటి తరం వీగిపోని స్వేచ్ఛ కావాలి



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract