STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

షరతులు వర్తిస్తాయి

షరతులు వర్తిస్తాయి

1 min
298

అగ్గిపెట్టెలోని పుల్లలకూ

గ్యాసు పొయ్యి మీద వంటలకూ

తిరిగే ఫ్యానుకూ వెలిగే బల్బుకూ

షరతులు వర్తిస్తాయి


వాయిదాల సామాన్లు

వద్దన్నా టెంప్ట్ చేసే డిస్కౌంట్లు

పెట్రోలు డీజిల్ ధరలు

షరతులు వర్తిస్తాయి


ఆదివారం ఖర్చులు

పండగలప్పుడు బెరుకులు

దీపాల నూనె ఖర్చు

దేవుని పూజకు కూడా

షరతులు వర్తిస్తాయి


ఎగువ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి

దేనికి చెందుతామో

దేనికి చెందాలో తెలీక

నిత్యం ఊగిసలాడే మేము

కనుగొంటూ ఉంటాము కొత్త కారణాలు



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract