STORYMIRROR

# Suryakiran #

Thriller

4  

# Suryakiran #

Thriller

' షేక్ ' చేసేశా !

' షేక్ ' చేసేశా !

1 min
432


అతడు ఆరడుగుల బొంబాయ్ బుల్లోడు .

దుబాయ్లో డైమండ్స్ బిజినెస్ చేస్తాడు .

త్వరలో మా నాన్నకు కాబోయే అల్లుడు .

ఈరోజే ఫ్లైట్లో గన్నవరం వచ్చేస్తున్నాడు .


మంచిమనసులో బుర్జ్ ఖలీఫా అంతటోడు ,

ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాడు .

అందరూ జేబునిండా సంపాదిస్తూ

సుఖమే తమకు నేస్తమంటూ

వజ్రంలా మెరవాలని తహతహలాడతాడు .


ఆంధ్రా నుంచి అమెరికా దాకా

వానిపేరు పలకనిదే నడవదు రాజకీయం .

వ్యాపారం విస్తరించి ఆ సంస్థ

ఉత్పత్తులు నేడు ఇంటింటికీ పరిచయం .


అమెజాన్కి ధీటుగా ఈ కామర్స్

విండోస్కి పోటీగా

మరొకటీ తేబోతున్నాడని రూమర్స్ .


ఐనా , తెలుగుపడుచునే ప్రేమిస్తున్నాడంటే

కోనసీమ కొబ్బరి , కర్నూలు మల్బరీ

ప్రత్యేక ఆకర్షణలయ్యుంటాయ్ .

సంక్రాంతి పిండివంటలు , కోడిపందాలూ

చూద్దామన్నా వినోదానికి మరెక్కడుంటాయ్ ?


అందాన్ని పెంచే ఓణీలకు

చెవి కోసుకోవాలనిపించే వీణావాదనలకు

మన ప్రాంతాలే బెస్టు .

జగనన్న , తారకన్నా

పరపతి పెంచుకోవాలని అభినందిస్తే

వారిదే గొప్పటేస్టు !


అందుకే , నేనూ వెనువెంటనే

పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశా .

ఇన్నాళ్ళూ పదిలంగా దాచుకున్న

హృదయాన్ని నా నవ్వులతో ' షేక్ ' చేసేశా !



Rate this content
Log in

Similar telugu poem from Thriller