STORYMIRROR

Dinakar Reddy

Abstract Classics

4  

Dinakar Reddy

Abstract Classics

సంకురాతిరి

సంకురాతిరి

1 min
329

రైతు చేతికి పంట వచ్చిన సoబరం,

మనలోని చికాకుల చీకట్లను 

కాల్చి వెలుగునిచ్చే భోగి మంటలు, 

విష్ణు ఆలయాల్లో గోదా కళ్యాణం,

కమ్మని దోసెల పండగ,


మకర సంక్రమణం, ఉత్తరాయణ పుణ్యకాలం, గoగిరెద్దులు, హరి దాసులు,

ముగ్గుల పోటీలు,

అత్తిరాసాలు, కజ్జికాయలు,

పెద్దలకు బట్టలు పెట్టే సంప్రదాయం,

పిల్లలు, పతంగులు,కొత్త బట్టలు,


కనుమ రోజు కాకిని కూడా ఎగరద్దన్న సామెతలు,

అలసంద వడలు,

కనుమ రోజు కోడా,మేకా అనే పెద్ద వాళ్ళు,

మా ఇంటికి రమ్మనే బంధువులు, 

వ్యవసాయానికి తోడ్పాటును ఇచ్చే

పశు సంపదకు పూజలు,

చిట్లా కుప్ప,

పండక్కి ఎవరెవరు ఏం చేశారు అని చర్చలు,

ఎప్పుడో కాని రాని ఆడకూతుళ్లు వచ్చి అందరిళ్ళళ్లో చేసే సందళ్లు, 

ఇంకా కొత్తగానే అనుకునే అల్లుళ్ళు,

వగలు పోయే బావా మరదళ్ల సరసాలు,


ఏదో విధంగా దూరంగా వెళ్ళిన వాళ్ళు దగ్గరికి రావాలని,

దగ్గరగా ఉన్నవాళ్ళ మధ్య దూరాలు చెరిగి పోవాలని, మొత్తానికి అందరూ ఆనoదంగా ఉండాలని,

ఆ ఆనందాన్ని నలుగురితో పంచుకోవాలని ,

ఒకరికొకరు సాయం చేసుకుoటూ

ముందుకు సాగాలని,

మరెన్నో మంచి ఉద్దేశ్యాలతో మన పెద్ద వాళ్ళు జరుపుకొమ్మన్న పెద్ద పండుగ కదూ ఈ సంకురాతిరి.



Rate this content
Log in

Similar telugu poem from Abstract