స్నేహసుమం
స్నేహసుమం
నన్ను-నేను పొగడుకోగ..మాటలతో పనేముంది..!
నా ప్రతిభను చాటుకోగ..లెక్కలతో పనేముంది..!
సొంతగొప్ప ప్రకటించే..స్వీయస్తుతి వింతకంపు..
నీచాటున నినుతిట్టగ..కవితలతో పనేముంది..!
గొప్పవారు కానివారు..ఎవరులేరు భూమిమీద..
నినుతక్కువ చేసుకునే..తలపులతో పనేముంది..!
ఎవరైనా నీసమమే..సమభావమె ఆత్మీయత..
సత్యమేదొ బోధపడగ..ఊహలతో పనేముంది..!
ఎవరినైన ఎపుడైనా..నొప్పించుట నేరమేను..
స్నేహసుమం మనసైతే..పూవులతో పనేముంది..!
కాలుడైన దేవుడైన..నీకునీవె తరచిచూడ..
కర్మసరిగ చేసినపుడు..పూజలతో పనేముంది..!
మరిమాధవ గజలంటే..ధర్మమర్మ సుబోధినియె..
కర్తవ్యపు సాక్షికింక..ఆశలతో పనేముంది..!
