శూన్యంలో మనిషి మనసు
శూన్యంలో మనిషి మనసు
అదిగో తెల్లారింది
బతుకుకు చీకటయింది
మళ్లీ గాయం తాలూకు
జ్ఞాపకాలు గుండెను
సూదుల్లా గుచ్చుతున్నాయి
గాయపడ్డ హృదయం
ముక్కలైన మనసు
చెదిరిన కలలు
మిగిలిన చేదు స్మృతులు
పొద్దున ఆశ
సాయంత్రం నిరాశ
ఎందుకంటే......
మార్చలేని గతాలు
మరువలేని నిజాలు
చెప్పుకోలేని గాథలు
చెరుపలేని గుర్తులు
గుండెలు పగిలేల
ప్రతి రోజు ఏడుపులు
ఉహాలలో మకరందం
వాస్తవంలో చెదుతత్వం
ప్రేమలో కోమలత్వం
పెళ్లిలో కఠినత్వం
రాత్రిళ్ళు రసరగా జీవితం
తెల్లవారితే బతుకు ప్రయోగాలు
చెప్పితే గాథ
చెప్పకపోతే వ్యథ
రాస్తే కథ
తీస్తే సినిమా
నిజమైన అబద్దాలు
అబద్ధమైన నిజాలు
ముసుగేసిన అందం
మోసపు చిరునవ్వు
ప్రేమలో దగా
దంపాత్యంలో మోసం
కోరికలు భంగం
బంగపాటుతో వ్యంగం
నడిరోడ్డులో భిక్షాటన
నలుగురిలో హేళన
ఆవిరైన ఆత్మీయత
అనవసరమైన ఆత్మహత్య
వట్టిపోయిన కాయం
మానిపోని గాయం
బతుకులో చావు
చావులో బతుకు
హాస్పిటల్లో గావుకేకలు
జీవనాడుల్లో వైరస్ ప్రవాహం
జీవనదుల్లో జీవం లేని శరీరం
స్మశానంలో ఆర్తనాదాలు
కాసి ఒడబోసిన
కానరాని విలువలు
తరలిపోయిన సున్నితత్వం
మాయమై పోయిన మానవత్వం
అయిన.....
ఈ విశాల విశ్వంలో
నీవు నేను ఎంత
కంటికి కనపడని ఇసుక రేణువంత
