STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Inspirational

4  

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Inspirational

శ్రమ యేవజయతే వచన కవితా సౌరభం రచన : కవీశ్వర్ 07 . 04 . 2023 .

శ్రమ యేవజయతే వచన కవితా సౌరభం రచన : కవీశ్వర్ 07 . 04 . 2023 .

1 min
371

శ్రమ యేవజయతే 

వచన కవితా సౌరభం 

రచన : కవీశ్వర్ 

07 . 04 . 2023 .

మది తలంపులలో లోక హితార్థం అభివృద్ధి పయనం 

పిపీలకముల వలే నిరంతర శ్రమ చే లక్ష్య సాధనం 

ఇతరుల సహాయ సహకారాదులచే స్వయంపథ గమనం

చేరుకున్న లక్ష్యం లో ఎలా చేరామని సమీక్షణం అవసరం


ఇతరుల శ్రమను మరువ కుండగా వారికి ఆసరాగా నిలుద్దాం

వారి జీవితాంతం మనను గుర్తు పెట్టుకునేలా ప్రవర్తిసు ఉందాం 

వారి మార్గదర్శనం లో మనం సాధ్యమైనంతగా పాలుపంచుకుందాం 

చక్కని ఆత్మ నిర్భరత్వాన్ని ప్రదర్శించి వారికి అండగా ఉందాం 


మనం సంఘజీవులం అందుకని ఒంటరి ఆలోచనలను చేయకుండా 

సమాజానికి పనికివచ్చే మంచిపనులు, శ్రద్ధాసక్తులచే కార్యాన్ని సాధిద్దాం 

మనం పదిమందికి మార్గదర్శకులుగా , సమాజ శ్రేయస్సుకు పాటుపడుదాం 

సమాజంలోని కల్మషాలను కష్టపడి సమూలంగా నిర్ములించి అభివృద్ధి సాధిద్దాం .


వ్యాఖ్య : " కష్టే ఫలి : శ్రమయేవ జయతే . శ్రద్ధ ఓర్పు మనకు మంచి ఫలితాలను కలుగ జేస్తాయి." 



Rate this content
Log in

Similar telugu poem from Abstract