STORYMIRROR

Venkata Rama Seshu Nandagiri

Abstract

4  

Venkata Rama Seshu Nandagiri

Abstract

జీవనజ్యోతి

జీవనజ్యోతి

1 min
306

పుట్టినంట పెరిగిన చిట్టి చేమంతి

అత్తింట అడుగిడిన అందాల ఇంతి

భర్తకు ముద్దు మురిపాల పూబంతి

అత్తమామలను భక్తితో సేవించు పడతి.

భర్త వంశాకురాన్ని తన గర్భాన మోస్తుంది

బిడ్డలకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేస్తుంది

ఆటపాటల్లో, చదువుల్లో మేటిని చేస్తుంది

దేశభక్తినిగా, వీరునిగా తయారు చేస్తుంది.

బంధు బాంధవులను ఆదరించేది

అందరికీ తలలో నాలుకలా మెలిగేది

పిన్నలను ప్రేమించి, పెద్దలను గౌరవించేది

పుట్టింటి, అత్తింటి పరువు నిలిపేది.

భర్త హృదయ సీమకు మహారాణిగా

ఇంటిని పరిపాలించే గృహ దేవతగా

అందరి మన్ననలు పొంది, ఒద్దికగా

మెలుగుతుంది తన ఇంట జీవనజ్యోతిగా.


Rate this content
Log in

Similar telugu poem from Abstract