STORYMIRROR

Venkata Rama Seshu Nandagiri

Abstract

4  

Venkata Rama Seshu Nandagiri

Abstract

పచ్చదనం-అనుబంధం

పచ్చదనం-అనుబంధం

1 min
381

ఆహ్లాదకరమైన ప్రకృతికి ప్రతీక పచ్చదనం

ప్రసాదిస్తుంది మనుగడను మనిషికి పచ్చదనం

మనిషి జీవనానికి అది కావలసిన ముఖ్య ఇంధనం

కానీ మనషి కోరేది పచ్చదనం కాదు ధనం

పచ్చదనాన్ని కాటు వేస్తోంది ఈనాడు కాలుష్యం

ప్రకృతి చేసిన మేలుకది మనిషి ఇచ్చిన బహుమానం

అభివృద్ధి అని మనిషి నెలకొల్పుతున్నాడు కర్మాగారం

కర్మాగారాల వలన ఔతోంది కలుషితం పర్యావరణం

రప్పించి జనులను పనులకోసం ఆక్రమిస్తున్నాం అరణ్యం

చెట్లు, చేమలు కోల్పోతున్నాయి సహజమైన పచ్చదనం

ప్రకృతి వలె సహజత్వాన్ని కోల్పోతోంది బాంధవ్యం

మసి బారి పోయింది ప్రేమానురాగాల వృక్షసహితం 

అనుబంధాలకు లేదిప్పుడు ధనానికున్న ప్రాముఖ్యం

పెరుగుట విరుగుట కొరకే యని మళ్ళీ మొలకెత్తాలి జనజీవం

తిరిగి రావాలి బంధాలు అనుబంధాలలో నాటి వైభవం

గ్రహించాలి మనిషి పచ్చదనానికి, అనుబంధానికి గల ప్రాముఖ్యం.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract