STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

4  

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

శీర్షిక: కవితా కన్యక - రసాస్వాదన kaweeshwar

శీర్షిక: కవితా కన్యక - రసాస్వాదన kaweeshwar

1 min
402

శీర్షిక: కవితా కన్యక - రసాస్వాదన  

చిత్ర కవిత : వచన కవిత : 19 . 01 . 2023 

తలపుల ఊహలకే అంకురించిన

రచనలతో కూడిన చిత్తరువులు శోభతో

కరములచే స్రుజించు నవ్యకావ్య కన్యవు

నీ విహరణ కలిగించు పాఠకుల రసానుభూతి

చతురతతో విలసిల్లు భావనల రెక్కల విన్యాసం

ప్రకృతి రమణీయ సమాకృతుల వర్ణించే కవుల

దాగిన హాస్య, వ్యంగ్య , శృంగార ,మొదలైన భావనల

అనుభూతి కలిగించు రసాస్వాదన చే హోయలొలికించు

ఊహల కలల అలలలో వెలిసిన స్వప్న సుందరివి నీవు.

గగన తలాన విహరించే నీ రెక్కల ద్వయాన్ని ఖండించి

నిర్వీర్యం చేసే నిరర్ధక రసహీనుల వర్జించి వారిని నీ మార్గంలో

పయనింపజేసే కవితా శక్తిని ప్రసరింపజేసే దివ్యతేజో కన్యకా మణివీవు. 

కవి, రచయిత, పాఠకుల మనంబులలో శృతి జేసే విశాల, కరుణాంత రంగిణి 


Rate this content
Log in

Similar telugu poem from Action