STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

సాగర తీరాన స్నేహం

సాగర తీరాన స్నేహం

1 min
360

పిల్లలేనా ఇసుకలో ఇళ్లు కట్టేది

ఈసారికి పిల్లల్లానే మేమూ ఇళ్ళు కట్టేసాం

బీచ్ ఒడ్డున ఎగురుతూ

అలలతో దాగుడుమూతలు ఆడుతూ

అటూ ఇటూ పరిగెడుతూ


మెల్లిగా నీళ్లతో పరుగులు

కొద్దిగా లోతు తెలిశాక అరుపులు

దారిలో కొన్న మొక్కజొన్న పొత్తు పరిమళం

ముక్కులోకి చెవుల్లోకి వద్దన్నా చొరబడి

కాస్త కళ్లకూ తగిలి

మంట పుట్టిస్తోన్న సముద్రపు ఉప్పు నీరు


ఎక్కడో గాలి

ఇక్కడ అలల తాకిడి

గెంతుతున్న మనుష్యులు

వస్తువులకు కాపలా ఉండి 

తమ వంతు కోసం వేచి ఉన్న స్నేహితులు


అలలతో నిత్యమూ పోరాటం చేసే

గంగ పుత్రులు ఒక వైపు

అలల్నే చూస్తూ ఆ రోజు కష్టాన్ని 

సముద్రంలోకి గిరవాటేసే సగటు మనుషులు


విశాఖ సాగర తీరాన

నాకు దొరికిన స్నేహం

నువ్వు కూడా..



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract