రోబో స్నేహితుడు
రోబో స్నేహితుడు
ఆటల్లో పాటల్లో నాకు తోడు
అలసినప్పుడు అలారంలా మోగుతాడు
కరెంటు మాత్రమే తింటాడు
ఎప్పుడూ చలాకీగా ఉంటాడు
చదువులో సందేహాలు
ఆటల్లో మెళకువలు
నిద్ర వేళకి జోల పాటలు
మరెన్నో కబుర్లు
సమయం ఏదైనా
సమస్య ఎలాంటిదైనా
నా తోడుండే రోబో స్నేహితుడు
ఒక్క విషయం మాత్రం చెప్పడు
అమ్మా నాన్న గురించి అడిగితే పలకడు
పోనీలే అనుకుంటే
జ్ఞాపకాల్ని చెరిపేస్తాడు
