రంగుల ప్రపంచం
రంగుల ప్రపంచం
అందరాని ఆశల వ్యూహాన్ని
ఆనందమని భ్రమపడి ...
అందంగా వున్నదని రంగుల ప్రపంచాన్ని
ఏలాలనే పిచ్చి ఆశతో...
నువ్వెంటో కానక వెండితెర మీన నీ బొమ్మకై పరుగులుతీస్తుంటే...
అవకాశం అనే ఉచ్చులో నిన్ను పడదోసి...
నీ అస్థిత్వాన్ని ఉప్పెనలా ముంచెయ్యాలని..
నీ ఉనికిని దూరం చెయ్యాలని ...
కాలనాగులు కాచుకు కూర్చున్నాయి గమనించుకో..!!!
పేరు,డబ్బు అనే ఆశ నీకు ఎరగా పెట్టి...
ఆకాశ నిచ్చెనలు అలవోకగా ఎక్కించి....
నిన్ను పాతాళానికి తొక్కడానికి...
రాబందులు కాచుకున్నాయి మేలుకో..!!!
అందని చందమామకై పరుగులు పెట్టక...
నీ ముందున్న గమనాన్ని గుర్తించి, సాధించు!!.
