రహస్యం
రహస్యం
అదుపు లేని ఆవేశాల నుంచి
వయసు చెప్పే వింత ఆలోచనల నుంచి
వలపు కెరటం నను నీ మీదకు తోసింది
అనుకోని భంగిమల అంతరం
ఆదమరచిన అనుభవాల జ్ఞానం
మరొక్కసారి పరవాలేదంది
తప్పో ఒప్పో తెలియని స్థితి నాది
తప్పంటూ ఏదీ లేదనే తత్వం నీది
బండరాతిని మల్లెతీగ అల్లుకోవటం
బాధపడిన మబ్బు తునకలకు
చంద్రుడు కలువ పూవుల కథ చెప్పినట్లు
ఏంటి నీకూ నాకూ మధ్య
ఏమీ లేని బంధం రహస్యంగా మారింది ఎందుకు
స్పర్శతో బంధించి
పంటి గాటుతో వశపరచుకోవడమా
శరీరాల ఊయల వలపు రాగాలు పాడడమా
రాత్రి
పగలూ
నేలా
నింగీ
ఏమా రహస్యం
పూర్తి కాని కట్టడాల వెనుక వ్యథల చిత్రం
అదే నీకూ నాకూ మధ్య ఓ పరిచయం
