STORYMIRROR

Rajagopalan V.T

Abstract Drama

3  

Rajagopalan V.T

Abstract Drama

రైతే రాజు

రైతే రాజు

1 min
11.7K


ప్రకృతేమో రైతన్నకు తోడులేని సమయంలో

ప్రభుత్వమే ముందుకొచ్చి చేయూతలందించు

రైతే రాజని నోరారా పిలిచేరు

రాజుకెందుకు సాయం అని ఎప్పుడూ ఆపకురు..


బడుగుజీవి బ్రతుకులోన కష్టాలెన్నో ఉన్నా

భయపడక ఎదురొడ్డి నిలిచేను రైతన్నా

ఆకలిబాధలెరిగి అందరికీ మంచి కోరి

భానుడి రాక ముందే నాగలిని చేత బట్టే

రైతన్నకు మనమందరం అండగా నిలుద్దాం


దళారీల వ్యవస్థలో దయనీయ స్థితికి చేరి

బతుకు వెళ్ళ దీస్తున్న రైతన్నకు సాయం చెయ్

పాడిపంట భూములన్నీ జన నివాసాలైతే

ధనిక పేద తేడా లేక ఆకలి బాధ లన్నీ

అందరికీ ఒక్కటే...


Rate this content
Log in

Similar telugu poem from Abstract