రాయంచకెరుక..
రాయంచకెరుక..
1 min
265
దమయంతివో
నాజూకు చేమంతివో
ఆ రాయంచకి ఏం చెబుతున్నావ్
మనసైన వరుడు కావాలనా
మరుని చూపులు తాకి
వికసించిన కోరికలు
వైశాఖ మాసాన వడగాల్పులు
వెన్నెల కోసం ఎదురు చూపులు
తాపము తీరగ
కౌగిలింతల ఆటలు మేల్కొన
చెక్కిలి ముద్దుల చేరి
ఎదను పరిచయం చేసికొని
నేటి పరిచయానికి
పవిత్రమైన పేరిడి
ఇరువురు ఒకటిగా
ఒకరిలో ఇద్దరుగా
వలపు సీమల నేల
రాకుమారునికి కొత్త ఆహ్వానం
రాయంచ చేర్చెనేమో..