STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Tragedy

4  

Dinakar Reddy

Abstract Drama Tragedy

రాజధర్మం

రాజధర్మం

1 min
324

రాజధర్మం పేరిట జరిగిన అకృత్యాలు

కోట గోడలు దాటని వెర్రి కేకలు

విషాదమును మ్రింగిన బానిస బతుకులు

వేడుకల చాటున వేదనపడ్డ జీవాలు


ఏదో చెప్పాలని

రుధిరాశ్రువులు పాళీలో నింపుకుని

కర్కశమైన లోకంలో

మనిషి అనే విచిత్ర ప్రాణిని గమనిస్తూ

ఎత్తుగడలను సవాలు చేస్తూ

సగం కాలిన శవాల గుట్టల మధ్య

యుద్ధానికి బలైన వారి దేహపు చర్మాల మీద

మానవత్వం బ్రతికే ఉందని నమ్మి (నమ్మించడానికి)

నేను ఓ కొత్త చరిత్ర వ్రాస్తున్నా

చదివే ధైర్యం ఉన్న వారికి అంకితమిస్తున్నా


రాజధర్మం పేరిట బలిగొన్న మనసుల వ్రణాలకి

అక్షర లేపనాలు పూస్తున్నా



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract