పుట్టగొడుగు
పుట్టగొడుగు
రాజా తోటలో
పూలవనం
బంతి, చామంతి
లిల్లి, మల్లి
వీటితో పూలకే
సోయగాలనిచ్చే
గులాబీ ఇలా అన్నది
మిలో వాసన ఉంటే
అందం ఉండదు
అందం ఉంటే
సువాసన ఉండదు
ఆ రెండు కలిపివున్న
నేనే ఈ పూల వనానికి
మహా రాణి ని
అని నవ్వుతూ గర్వంగా
తెలిపింది
అంతలో పెనుగాలి వీసింది
గులాబీ తన రెక్కలని కోల్పోయింది
వాన కురిసింది గులాబీ మొక్క
చచ్చి పడింది
వనం లో బంతి, చామంతులతో
అన్ని మొక్కలు చనిపోయాయి
అప్పుడు గర్వంగా లేచి నిలుచున్నది
పుట్టగొడుగు
బంతి, చామంతి గులాబీలు తనను
ఎంతగానో హేళన చేసాయి
కడకు నెలలు కృసించి పోయాయి
నేడు పుట్టగొడుగు తల ఎత్తుకొని
గర్వంగా చెపుతోంది
ఎంతటి గాలి, వాన అయిన
నేను క్రుంగి పోక మీ అందరికి రుచికరమైన, సత్తువైన ఆహారాన్ని ఇచ్చే నా జీవితం ధన్యం
