పుస్తకం ఒక నేస్తం
పుస్తకం ఒక నేస్తం
చదువుతాను నేను పుస్తకం,
అది నాకు ఇస్తుంది ఉత్సాహం,
ఉపాధ్యాయులు అందిస్తారు నాకు ప్రోత్సాహం,
వాళ్లు చెప్పే పాఠాలు చాలా మధురం,
ఉపన్యాసం చెప్తే నాకు దక్కుతుంది గౌరవం,
ఇవే నా విజయాలకు మూలం,
పుస్తక పఠనం అవ్వాలి అందరి కర్తవ్యం,
మనం జీవితంలో పైకి ఎదగడానికి ఇస్తుంది ధైర్యం,
పుస్తకం ఉంటుంది మన జీవితంలో చిరకాలం,
పుస్తకం మనకు ఒక నేస్తం,
పుస్తకాలంటే ఇష్టం ఉన్న వారికి ఈ కవిత అంకితం.
పుస్తకాలే మన నేస్తాలు
పుస్తకాలే విలువైన ఆస్తులు.