పురుషుల దినోత్సవం
పురుషుల దినోత్సవం


గృహమునకు కల్పతరువులు యజమానులు
వారి నీడన చల్లగ జీవించే కుటుంబ సభ్యులు
వారి అడుగున అడుగులు వేసే భార్యామణులు
మాటను మీరక, ఆదరించి, గౌరవించే పిల్లలు
ఎంత ఎదిగినా ముద్దుగ చూసే తల్లి దండ్రులు
ప్రేమాభిమానాలను పంచే సోదరీ సోదరులు
సోదర భావనతో మసిలే బంధు బాంధవులు
స్నేహానికి మరో నిర్వచనం చెప్పే స్నేహితులు
ఇన్ని సౌకర్యాలు కలిగి ఉన్న పురుష పుంగవులు
కుటుంబ సభ్యులకై శ్రమించి, ప్రేమనొందే ధన్యులు
వారందరికీ మా స్త్రీ జాతి అందించే అభినందనలు