పురాణ శ్రవణం
పురాణ శ్రవణం
శాశ్వతత్వం కోసం పాకులాట
జీవితాన్ని వెచ్చించే ఆట
తపస్సుతో ప్రసన్నం చేసుకుని
వింత వరాలెన్ని పొందినా
చివరకు మృత్యువును ముద్దాడవలసిందే
ఎన్ని చదివినా
ఎన్ని సార్లు విన్నా
ఏం చెబుతున్నాయి ఆ పురాణ కథలు
మాయలూ మంత్రాలా
రహస్య తంత్రాలా
అవేనా
కాదు కదా
వచ్చే ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని
అన్ని జీవుల్లోనూ దైవాన్ని చూడమని
నిజాయితీ, కరుణ కలిగి ఉండమని
ధర్మాన్ని పాటించమని
ఇలాంటివి గ్రహించకుండా
పురాణ శ్రవణం ఎంత చేస్తే ఏమిటి
నీలోని దైవాన్ని నువ్వే గుర్తించనప్పుడు
ఆ పరితపించడం ఆగదు
తానూ నేనుగా ఉన్నది ఒకటేనని
తత్వమసి అని గ్రహించు
