Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

murali sudha

Abstract

4  

murali sudha

Abstract

ప్రశ్నార్ధకం

ప్రశ్నార్ధకం

1 min
270


ప్రశ్నార్ధకం.....


ఏ ఏ ఏ ఏ

చీకట్లను చీల్చుకు కొత్త వుదయాలు పుట్టాలి

ఏ ఏ ఏ ఏ

ఎరుపెక్కిన నేత్రాల ప్రశ్నలకు కొత్త జవాబులు అన్వేషింపబడాలి


చుట్టూతా శూన్యం

అలజడులూ అలికిడులూ నిస్తేజం

ముంచుకొచ్చిన ప్రళయం

స్తబ్దతలు సందిగ్దతలు ఏలుతున్నవి రాజ్యం


మందుగుండు సామగ్రిని మోస్తున్నవే

ఆ నడుస్తున్న గుండెలు

ముట్టుకుంటే చాలు భళ్ళున పగిలే

నీటి బుడగలు ఆ జీవితాలు


ఇచ్చోటనే

సమాధి కాబడుతున్నవి

కలలూ కన్నీళ్లు

ఇచ్చోటనే 

కూలబడి కుదేలు అవుతున్నవి

భావితరపు బతుకులు


మందూ విందులకై ఎగబడుతున్నవి

రేపటి సమాధులు

రేపటి రోజులనిండా నిండుకుంటున్నవి

గతకాలపు ప్రశ్నలు


సుధామురళి


Rate this content
Log in

Similar telugu poem from Abstract