Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

SATYA PAVAN GANDHAM

Abstract Classics Others

4.5  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Others

"మాటే వినదుగా..!"

"మాటే వినదుగా..!"

1 min
266



"తానొక ముగిసిన అధ్యాయమే కదా..!"


అని నా మది హెచ్చరిస్తుంటే,


"ఆ ముగిసిన అధ్యాయంలో అక్షరాలు మాత్రం ఎప్పటికీ సజీవమే కదా..!"


అంటూ నా ఎద సమర్థించుకుంటుంది.


"గడిచిన కాలమొక గతమనుకుని వదిలేయమని"


నా మది హెచ్చరిస్తుంటే,


"ఆ కాలం మిగిల్చిన గతమే రేపటి భవిష్యత్తుకి పాఠమవబోతుందని"


నా ఎద సమర్థించుకుంటుంది.


"వదిలేసిన వాళ్ళని పట్టుకోవాలనుకుంటే నష్టపోతావని"


నా మది హెచ్చరిస్తుంటే,


"పట్టుకున్న వాళ్ళని వదిలేయడం కష్టమవుతుందని"


నా ఎద సమర్థించుకుంటుంది.


"స్వార్థమే రాజ్యమేలుతున్న ఈ లోకంలో ముక్కుసూటిగా మెలగడం అవసరమా ?"


అని నా మది హెచ్చరిస్తుంటే,


"ఆ స్వార్ధపు రాజ్యంపై దండెత్తే ఏకైక శత్రువే ఈ ముక్కుసూటి తత్వం ..!"


అని నా ఎద సమర్థించుకుంటుంది.


"కష్ట నష్టాలు పెనవేసుకున్న నీ జీవితానికి ఈ అదనపు భారం అవసరమా ?"


అని నా మది హెచ్చరిస్తుంటే,


"ఇష్టాలపై మక్కువ లేని వాడికి అది అదనపు భారం కాదు, ఆహ్వానించదగిన అతిథని"


నా ఎద సమర్థించుకుంటుంది.


"అవతలి వాళ్ళు నీతో మూడు ముక్కలాట(జీవితం) ఆడుతూ అందులో నిన్ను జోకర్ ని చేశారని"


నా మది హెచ్చరిస్తుంటే,


"అసలు జోకర్ అనేవాడు లేకపోతే ఇక అవతలి వాళ్ళకి అసలు ఆటేక్కడుందని (జీవితం)"


నా ఎద సమర్థించుకుంటుంది.


"లోకులు ముందు లోకువతున్నావంటూ..."


నా మది హెచ్చరిస్తుంటే,


"లౌకికతత్వం తెలియని లోకులు కాకులంటూ, అసలు వాళ్ల గురించి ఆలోచించాల్సిన పనే లేదంటూ..."


నా ఎద సమర్థించుకుంటుంది.


"ఎన్నాళ్లీ ఆలోచనలతో నలిగిపోతావని"


నా మది హెచ్చరిస్తుంటే,


"ఆ ఆలోచనల దాహార్తి, ఈ అక్షరాల రూపంలో సమసిపోతాయని"


నా ఎద సమర్థించుకుంటుంది.


అవును..!


భావోద్వేగంతో నిండిన నా ఎదను,


జ్ఞానోదయం చెయ్యాలని నా మది ఎంత ప్రయత్నించినా


దాని మాట వినడం లేదు !!


-mr.satya's_writings... ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu poem from Abstract