ప్రకృతిలో ప్రణయం..
ప్రకృతిలో ప్రణయం..
1 min
306
లేళ్లు నెమళ్ళు
సెలయేటి సందళ్లు
కుందేళ్ళ చప్పుళ్ళు
కొత్త చివుళ్ల కళకళలు
దరహాసము చేయుచున్న సఖిని చూసి
పూల తీగల ఊయల పట్టి
ఆమె దరి చేరి
సరసమాడి మెప్పించి
నూతన ఉత్తేజం కలిగించాడు
పూవుల దాగిన తేనెను
పెదవులకంటించి
అతనికి రుచి చూపినదామె
కంటి రెప్పల కిటికీలు
ప్రతిబింబములను దాచి
మరల మరల చూపించినవి
సమయము ఎరుగక క్రీడించి
వలపు వసంత మంటపములో
గ్రీష్మము వరకూ ఎదురు చూసిరి
ప్రకృతిలో ప్రణయం చూసి
పక్షులు వసంతమును మరింత కాలము ఆగమని చెప్పెను..