STORYMIRROR

Venkata Rama Seshu Nandagiri

Abstract

4  

Venkata Rama Seshu Nandagiri

Abstract

ప్రకృతి సౌందర్యం

ప్రకృతి సౌందర్యం

1 min
572

పద్మాకరుని వెలుగులు నిండినవి ఎల్లెడలా

ప్రకృతి మాత పులకరించినది కోన కోనలా,

పల్చని జలతారు కిరణాలు మురియుచు

పుడమిపై సొబగుగా జాలువారె మెరయుచు

ప్రాతఃకాలాన వీచుచున్నవి మంద్రసమీరములు

పథికుల మనసునాహ్లాద పరచు పిల్ల తెమ్మెరలు

పూసంత వాడియైన రవికిరణముల తాకిడికి

పుష్పములు ఓర్వలేక వాలినవి ఆ తాపానికి

పత్రములు, ఫలములను పూజకై త్రుంచబోయి,

పుష్పవిలాపముగ భావించి వారు వెనుతిరిగిరోయి

ప్రొద్దెక్కిన మరింత పెరిగె భానుడి ప్రతాపము

పశుపక్ష్యాదులు నీడను చేరె ఆగలేక పాపము

ప్రాణికోటి అల్లాడుచున్నది వర్షాభావముచే

పయోధరములు వెలతెలబోయెను జలాభావముచే

పశ్చిమ దిశకు చేరిన భాస్కరుడు నీరసించె

ప్రభాకరుడు చల్లారగనే ప్రాణికోటి సంతసించె

పున్నమి వెన్నెలలను చిందించు రాకాచంద్రుని రాకకై

ప్రకృతికాంత వేచియున్నది వెన్నెలలనాస్వాదించుటకై


Rate this content
Log in

Similar telugu poem from Abstract