STORYMIRROR

Midhun babu

Inspirational Others

4  

Midhun babu

Inspirational Others

ప్రకృతి ఒడిలో పయనిద్ధాం

ప్రకృతి ఒడిలో పయనిద్ధాం

1 min
308

కాపాడుకుంటే ప్రకృతి తరగని ఊట బావి

అమ్మలకన్నా అద్భుత దయామయి

మౌనంగా మనందరినీ పెంచే బాధ్యత గల నాన్న 

అత్యాశతో పాలిచ్చే పాలిండ్లను కోసేస్తే

భుజాల పైకెక్కి నాన్న నెత్తిపై మోదితే

కక్కుర్తితో కడుపెల్లా మెక్కితే అజీర్తి

చక్కరొచ్చేలా తిన్నదంతా కక్కిస్తది


ప్రకృతిని గుండెల్లో పొదిగితే వృక్షమైతది

నమ్ముకున్న దైవంలా కాపాడుకుంటే

కంటికి కనిపించే దేవతై

చల్లని చూపుతో కరుణిస్తది

కాయోపండో కాదు కాతనందించి

మట్టిలోంచి అమృతాలను పంచుతది

ఆకాశం నుంచి కిందికి దిగొచ్చి మైల కడిగేస్తది


ప్రకృతి దయ తెలిస్తే కంటి నిండా నిద్ర

కడుపులకు కమ్మని భోజనం

ఆత్మగల్లా భవిష్యత్ జీవనం

ప్రకృతి చెవులు, ముక్కు కోసి, అత్యాచారం చేస్తే

కడుపు శోకం మిగిలిస్తే

ఎండలై కరుస్తది, వరదలై, వడగళ్ళై ముంచుతది

కడుపు చించుకుంటే కాళ్ల మీద పడ్డట్లు

గోద లాంటి ప్రకృతికి పుండు చేసి ముళ్ళు గర్రతో పొడిస్తే

వికృత రూపాన్ని విశ్వవ్యాప్తం చేసి దెబ్బతీస్తది


ప్రకృతి ఒడిలో హాయిగా పయనిద్దాం

ఆత్మగల ఆప్తుల్లా కాపాడుకుందాం

ప్రకృతి తరగని సంపద జాగ్రత్తగా చూసుకుంటే

ప్రకృతిని తనివి తీరా ఆస్వాదిస్తే

అందమైన అనుభూతి అద్భుతాలు


జీవుల జీవనమంతా ప్రకృతిలోనే

పయనం, పరిసమాప్తం కావాలి ప్రజోపయోగం

ప్రకృతిలో విలీనమయ్యేంతవరకు



Rate this content
Log in

Similar telugu poem from Inspirational