ప్రకృతే.. తోడు!!
ప్రకృతే.. తోడు!!
"ఒంటరిని కాదు నేను..!"
పుట్టుక నుండి ఊపిరినందిస్తూ బ్రతికించే "గాలి.."
నా తోడు..!!
"అందుకే నేను ఒంటరిని కాదు..!!"
అలసిన దేహానికి దాహంతో సేదతీర్చే "నీరు.."
నా తోడు..!!
"అందుకే నేను ఒంటరిని కాదు..!!"
నిరాశతో పైకి చూస్తే, అవకాశాలు అనంతమంటూ ఆశలు కలిగించే "నింగి.."
నాతోడు..!!
"అందుకే నేను ఒంటరిని కాదు..!!"
నిట్టూర్పుతో తల వాలిస్తే, నేనున్నాంటూ వెన్నుతట్టి నడిపించే "నేల.."
నాతోడు..!!
"అందుకే నేను ఒంటరిని కాదు..!!"
చివరికి చితిలో కూడా నన్ను విడవని "నిప్పు.."
నా తోడు..!!
"అందుకే నేను ఒంటరిని కాదు..!!"
నా పుట్టుక మొదలు మరణం వరకూ.., పంచభూతాలైన ఈ ప్రతీ ప్రకృతి సృష్టి నాకు తోడుండగా...!!
నేనెలా.. ఒంటరిని??
సత్య పవన్✍️
